నిత్య మీనన్ ‘గుండె జారి గల్లంతయింది’

నిత్య మీనన్ ‘గుండె జారి గల్లంతయింది’

Published on Nov 3, 2012 11:32 AM IST

నితిన్, నిత్య మీనన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇష్క్’ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. వరుస పరాజయాలతో సతమవుతున్న నితిన్ ఈ సినిమాతో మళ్లీ రైట్ ట్రాక్ మీద పడ్డాడు. మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ‘గుండె జారి గల్లంతయిందే’ అనే సినిమా రాబోతుంది. నిత్య మీనన్ ఈ చిత్ర షూటింగ్లో జాయిన్ అయింది. కొండ విజయ్ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిత్య మీనన్ తో పాటుగా ఇషా తల్వార్ మరో కథానాయికగా ఎంపికైంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఆండ్రూ సినిమాటోగ్రాఫర్. ఇష్క్ సినిమాని నిర్మించిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు