పోలీస్ గేమ్ ఆడనున్న శ్రీహరి

పోలీస్ గేమ్ ఆడనున్న శ్రీహరి

Published on Nov 3, 2012 1:25 AM IST

శ్రీహరి పోలీస్ పాత్రలో ఒక చిత్రం రానుంది “పోలీస్ గేమ్” అనే ఈ చిత్రానికి సహదేవ దివి దర్శకత్వం వహిస్తున్నారు. దేవా విజిత సమర్పణలో సుజాత దేవా ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. తల్లి తండ్రులు తమ బిడ్డలను సరైన మార్గంలో నడిపిస్తే సైనికులవుతారు లేకపోతే ఉగ్రవాదులు అవుతారు అనే అంశాన్ని ఈ చిత్రంలో చర్చించాము అని దర్శకుడు అన్నారు. డ్రగ్స్ మాఫియ కోరల్లో ఇరుక్కొని భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న యువతని సరైన మార్గంలో పెట్టడానికి ఒక పోలీస్ ఆడిన గేమ్ ఈ చిత్రం. త్వరలో ఈ చిత్ర పాటలను విడుదల చేయ్యనున్నామని నిర్మాత తెలిపారు.

తాజా వార్తలు