నిఖిల్ – స్వాతిల సినిమా చివరి షెడ్యూల్

నిఖిల్ – స్వాతిల సినిమా చివరి షెడ్యూల్

Published on Oct 31, 2012 3:05 PM IST


ఈ మధ్య వరుస ఫ్లాపులతో డీలా పడిపోయిన నిఖిల్ కొంచెం లుక్ మార్చి చేస్తున్న సినిమా ‘స్వామి రా రా’. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. ‘ రేపటి నుంచి ‘స్వామి రా రా’ చివరి షెడ్యూల్ మొదలు కానుంది. ఈ చిత్ర టీంతో కలిసి పని చేయనున్న చివరి రోజుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని నిఖిల్ ట్వీట్ చేసారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటిస్తోంది. సౌత్ ఇండియా లోని పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. వినాయక చవితికి విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా బాగున్నాయి మరియు చిన్ని ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు