వారి వల్లే సినిమా అంత హిట్ అయింది

వారి వల్లే సినిమా అంత హిట్ అయింది

Published on Oct 30, 2012 3:01 PM IST


మంచు విష్ణు, హన్సిక జంటగా నటించిన ‘దేనికైనా రెడీ’ గత వారం విడుదలై సూపర్ హిట్ టాక్ తో నడుస్తుండగా ఈ చిత్రం విజయం సాధించడం పట్ల హన్సిక తన ఆనందాన్ని మీడియా వారికి తెలియజేసింది. ఈ చిత్రం విజయం సాధించడం పట్ల తాను ప్రతి ఒక్కరికీ మరీ ముఖ్యంగా ప్రేక్షకులకి తన అభిమానులకి థాంక్స్ చెప్పింది. ఈ కథ విన్న రోజు నుండి షూటింగ్ మొదలైన రోజు నుండే సినిమా మీద తనకు గట్టి నమ్మకం ఉండేది. ఈ క్రెడిట్ అంతా విష్ణు, మోహన్ బాబు గారికి, చిత్ర దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి గారికే సొంతం. యువన్, చక్రి సంగీతం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా తరువాత తెలుగులో చాల ఆఫర్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు