రాంబాబుకి డబ్బింగ్ చెబుతున్న పవన్

రాంబాబుకి డబ్బింగ్ చెబుతున్న పవన్

Published on Sep 27, 2012 12:28 PM IST


పవర్ స్టార్ పవన కళ్యాణ్ హీరోగా రానున్న ‘ కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రానికి ఈ రోజు ఉదయం నుండి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. వరుసగా రోజూ డబ్బింగ్ చెప్పి త్వరలోనే డబ్బింగ్ పూర్తి చేసి ఈ సినిమాని అక్టోబర్ 18న విడుదల చ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మించారు.

స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో నిన్న మార్కెట్లోకి విడుదలయ్యింది. మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర పోషించారు. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న ఈ సినిమాతో మళ్ళీ మరో సూపర్ హిట్ కొట్టాలని ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు