రిచాను ఆకట్టుకున్న సార్ వచ్చారు చిత్రంలో పాట

రిచాను ఆకట్టుకున్న సార్ వచ్చారు చిత్రంలో పాట

Published on Sep 27, 2012 12:30 AM IST


ప్రస్తుతం “సార్ వచ్చారు” చిత్రంలో చేస్తున్న పాట రిచా గంగోపాధ్యాయ్ ని ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్ మరియు కాజల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ చిత్రంలో ఒక పాట గురించి రిచా ” రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్న పాట చాలా బాగుంది “రచ్చ రంబోల” మాస్ పాట దేవి శ్రీ చాల బాగా ఇచ్చారు” అని అన్నారు. రవితేజ తో రిచా చేస్తున్న రెండవ చిత్రం ఇది. గతంలో వీరిద్దరూ కలిసి “మొరపకి” చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో చాలా భాగం జర్మనిలో చిత్రీకరించారు. అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు