భారీ విజయం సాదించిన సక్కు భాయి

భారీ విజయం సాదించిన సక్కు భాయి

Published on Sep 13, 2012 3:30 AM IST


చార్మీ కొత్త అవతారంలో కనబడినప్పటి నుండి ఆమె అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆమె చాలా బరువు తగ్గారు, నాగార్జున “డమరుకం” చిత్రంలో సక్కుభాయి పాటను చెయ్యమని అడిగినప్పుడు నుండి ఈ పాట గురించి, దేవి శ్రీ ప్రసాద్ గురించి మరియు తన లుక్ గురించి చెబుతూనే ఉంది. ఈ మధ్యనే విడుదల అయిన టీజర్ కి మంచి స్పందన లభించింది అంతే కాకుండా ఈ ఏడాది హాటెస్ట్ ఐటం పాటల్లో ఇది కూడా ఒకటి కానుంది. ట్విట్టర్లో తనకి అభిమానుల నుండి వస్తున్న సందేశాలకు సమాధానమిస్తూ చార్మీ బిజీగా ఉంటున్నారు. ప్రేక్షకులు ఆమె గురించి మాట్లాడుకునేలా ఈ పాట చెయ్యగలిగింది గతంలో ఈ భామ నాగార్జున “రగడ” చిత్రంలో ఐటం సాంగ్ లో చేసింది తిరిగి “డమరుకం” చిత్రం కోసం ఈ పాట చెయ్యడం జరిగింది. దీని తరువాత మళ్ళి తనకి మంచి ఆఫర్లు వస్తాయో రావో అన్న విషయం మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి చార్మీ వార్తల్లో ఉంది. నాగార్జున మరియు అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ మధ్యలో విడుదల కానుంది.

తాజా వార్తలు