బ్యాండ్ బజావో బారాత్ తమిళ రీమేక్ లో నాని?

బ్యాండ్ బజావో బారాత్ తమిళ రీమేక్ లో నాని?

Published on Sep 12, 2012 4:06 AM IST


హిందీలో బ్లాక్ బస్టర్ చిత్రం “బ్యాండ్ బజావో బారాత్” రీమేక్ కోసం హీరో నానిని సంప్రదించినట్టు సమాచారం. రన్వీర్ సింగ్ మరియు అనుష్క శర్మలు ప్రధాన పాత్రలో ఈ చిత్రం హిందీలో తెరకెక్కింది. “నాన్ ఈ” చిత్ర విజం తరువాత నాని తమిళంలో కూడా మంచి ప్రాచుర్యం పొందారు. అక్కడి నిర్మాతలు కూడా నానిని సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం నాని తెలుగులో రెండు చిత్రాలలో నటిస్తున్నారు గౌతం మీనన్ దర్శకత్వంలో “ఎటో వెళ్లిపోయింది మనసు” మరియు సముధ్రఖని దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. విష్ణు వర్ధన్ దగ్గర అసోసియేట్ గా పని చేసిన గోకుల్ “బ్యాండ్ బజావో బారాత్” చిత్ర రీమేక్ కోసం నానిని సంప్రదించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో చెయ్యాలని దర్శకుడు అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతంనాని”ఎటో వెళ్లిపోయింది మనసు” మరియు కృష్ణ వంశీ “జెండా పై కపిరాజు” చిత్రాల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కోసం పరిణీతి చోప్రాని సంప్రదించినట్టు కూడా సమాచారం ఈ చిత్రం మొదలవుతుందో లేదో వేచి చూడాలి.

తాజా వార్తలు