ఆయనతో పోటీ పడగలరేమో చూసుకోండి : ఎస్.ఎస్ రాజమౌళి

ఆయనతో పోటీ పడగలరేమో చూసుకోండి : ఎస్.ఎస్ రాజమౌళి

Published on Sep 11, 2012 5:24 PM IST


‘కింగ్’అక్కినేని నాగార్జున నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ఆడియో వేడుక నిన్న శిల్పకళా వేదికలో ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకకి ఇండస్ట్రీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ వేడుకకి హాజరైన టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ ‘ ముందుగా 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్న దేవీ శ్రీ కి నా శుభాకాంక్షలు. అలాగే ‘శిరిడి సాయి’ లాంటి ఒక మంచి చిత్రాన్ని మాకు అందించినందుకు నాగార్జున గారికి ధన్యవాదాలు. ఎవరైనా కెరీర్ మొదట్లో వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత స్టాండర్డ్ సినిమాలు చేస్తుంటారు కానీ నాగార్జున గారు ఇప్పుడు కూడా ఒక సినిమాతో ఇంకో సినిమా సంబంధం లేకుండా కొత్త కొత్త ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు మరియు మునుపటి కన్నా అందంగా తయారవుతున్నారు. ఈ సందర్భంగా ఇక్కడున్న హీరో నాగ చైతన్య కి మరియు హీరో కావాలనుకుంటున్న అఖిల్ కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాగార్జున గారితో ఎంత వరకూ పోటీపడి సినిమాలు చేయగలరో మీరే నిర్ణయించుకోండి అని ‘ ఆయన అన్నారు.

యోగా బ్యూటీ అనుష్క కథానాయికగా నటించిన ఈ సినిమాకి వెలిగొండ శ్రీనివాస్ కథని అందించగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై డా. వెంకట్ నిర్మించిన ఈ చిత్రానికి యౌన్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమ అందించారు. ఇది దేవీ శ్రీ సంగీతం అందించిన 50వ చిత్రం కావడం విశేషం.

తాజా వార్తలు