మన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఎంతో మంది యువకులకు కలల రాణి. ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉండటం వల్ల ఖాళీ టైం దొరకడం లేదు. తన అభిమానులు తమన్నా ఒక వేల ఖాళీ టైం దొరికితే ఏమి చేస్తుందా? అని అడిగిన ప్రశ్నకు తమన్నా సమాధానం ఇస్తూ ‘ ఖాళీ టైం ఎందుకు ఉండాలండీ? లైఫ్ లో ప్రతి ఒక్క నిమిషమూ ఎంతో విలువైనది. అలా అని నేను 24 గంటలు సినిమాలు చేస్తుంటానని కాదు, కానీ ఎక్కువ భాగం సినీ ప్రపంచంలోనే ఉంటాను, మిగతా టైం మా ఫ్యామిలీతో గడుపుతాను. ఇవన్నీ పక్కన పెడితే 100% పని చేస్తేనే కుటుంబంతో సంతోషమైన సమయాన్ని గడపవచ్చు అని’ ఆమె అన్నారు.
ఇంత నిజాయితీగా మాట్లాడిన తమన్నా నటించిన రెండు పెద్ద చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం కాగా మరొకటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రెబల్’ చిత్రం.