మొదలయిన “రెబల్” డిటిఎస్ కార్యక్రమాలు

మొదలయిన “రెబల్” డిటిఎస్ కార్యక్రమాలు

Published on Sep 10, 2012 6:17 PM IST

ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రెబల్” డిటిఎస్ కార్యక్రమాలను ఈరోజు మొదలుపెట్టుకుంది. ఈ కార్యక్రమాలు మరి కొద్ది రోజుల్లో పూర్తి కానుంది. ఏ చిత్రానికి అయిన డిటిఎస్ ప్రాణం పోస్తుంది అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తమన్నా ఈ చిత్రంలో ప్రభాస్ పక్కన ప్రధాన కథానాయికగా కనిపించనుండగా దీక్ష సెత్ రెండవ కథానాయికగా కనిపించనుంది. కాంచన విజయం తరువాత లారెన్స్ చేస్తున్న చిత్రం ఇది ఈ చిత్రంలో ప్రభాస్ ని కొత్త రూపంలో చూపించారు. ప్రభాస్ కెరీర్లో ఇదే భారీ బడ్జెట్ చిత్రం. ఈ చిత్రాన్ని జే.భగవాన్ మరియు జే పుల్ల రావు సంయుక్తంగా బాలాజీ సిని మీడియా బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. లారెన్స్ తనే స్వయంగా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో సెప్టెంబర్ 14న విడుదల కానుంది.

తాజా వార్తలు