నయనతార సెకండ్ ఇన్నింగ్స్ లో మెప్పించగలదా?

నయనతార సెకండ్ ఇన్నింగ్స్ లో మెప్పించగలదా?

Published on Sep 11, 2012 8:21 AM IST


దాదాపు పదేళ్ళపాటు ప్రేక్షకులని అలరించిన నయనతార, ప్రభుదేవాని పెళ్లి చేసుకొని నటనకి స్వస్తి చెప్పాలనుకుంది. కాని తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టు ప్రభుదేవాతో ఆమె ప్రేమాయణం పెళ్లి దాకా సాగలేదు. దాంతో మళ్లీ యాక్టింగ్ మొదలు పెట్టిన నయనతార సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంత వరకు మెప్పించగలదు అనేది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న? పదేళ్ళ కాలంలో ఆమెకు గ్లామర్ వోలకబోసే పాత్రలు ఎన్నో చేసింది కాని గుర్తుండిపోయే పాత్రలు మాత్రం పెద్దగా చేయలేదనే చెప్పాలి. సినిమాలకు స్వస్తి చెప్పాలనుకుని చేసిన చివరి సినిమా శ్రీ రామరాజ్యంలో చేసిన సీత పాత్ర మాత్రం ఆమె కెరీర్లో మైలురాయి అనే చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్ లో నాగార్జున సరసన దశరద్ డైరెక్షన్లో ‘లవ్ స్టొరీ’, గోపీచంద్ సరసన ఒక సినిమా, రానా సరసన క్రిష్ డైరెక్షన్లో ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇన్ని సినిమాలు చేస్తున్న నయనతార గతంలో లాగా మెప్పిస్తుందంటారా.

తాజా వార్తలు