‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ యు.ఎస్ ప్రింట్స్ వివరాలు

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ యు.ఎస్ ప్రింట్స్ వివరాలు

Published on Sep 10, 2012 3:30 PM IST


సున్నితమైన కథాంశాలతో చిత్రాలు తీసే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం భారీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర యు.ఎస్ ప్రింట్స్ కి సంబందించిన సమాచారం మీకందిస్తున్నాం. 15 సాదారణ ప్రింట్స్ మరియు 52 డిజిటల్ ప్రింట్స్ రేపు సాయంత్రం యు.ఎస్ కి వెళ్లబోయే ఫ్లైట్ లో వెళ్లనున్నాయి.

ఈ చిత్రంలో నూతన నటీనటులతో పాటు అమల అక్కినేని, శ్రియ సరన్ మరియు అంజలా జావేరి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. మరిన్ని ఓవర్సీస్ ప్రింట్స్ వివరాల గురించి మాకు అందుబాటులోకి రాగానే తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు