‘చంద్రముఖి 2’ లో అజిత్ నటించనున్నాడా?

‘చంద్రముఖి 2’ లో అజిత్ నటించనున్నాడా?

Published on Sep 10, 2012 8:37 AM IST


సూపర్ స్టార్ రజనీ కాంత్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘చంద్రముఖి’. అలాగే ఈ కథాంశం తో వచ్చిన సినిమా అన్ని భాషల్లోనూ హిట్ చిత్రంగా నిలిచింది. ఇది మన భారతీయ సాంప్రదాయాన్ని మరియు సైన్స్ కలగలిసిన సినిమా. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని అందులో ‘తల’ అజిత్ నటించనున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ కథా చర్చలు మొదటి దశలోనే ఉన్నాయి, పూర్తి కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పట్టవచ్చు.

‘చంద్రముఖి’ సినిమాకి పి. వాసు దర్శకత్వం వహించారు మరియు ఈ చిత్రం ద్వారానే నాయనతార తెలుగు మరియు తమిళ బాషలకు కథానాయికగా పరిచయమయ్యారు.త్వరలోనే కథా చర్చలు పూర్తి చేసుకుని ఈ చిత్ర నటీనటులను మరియు సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం సీక్వెల్ లో సూపర్ స్టార్ రజనీ కాంత్ అతిధి పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.

తాజా వార్తలు