యువన్ చేస్తున్న నూరవ చిత్రం “బిర్యాని”

యువన్ చేస్తున్న నూరవ చిత్రం “బిర్యాని”

Published on Jul 16, 2012 9:45 PM IST


యువన్ శంకర్ రాజ తన కెరీర్లో ఒక కీలకమయిన మైలురాయిని అందుకోనున్నారు. త్వరలో అయన వెంకట్ ప్రభు చేస్తున్న “బిర్యాని” చిత్రానికి సంగీతం అందించనున్నారు.ఈ చిత్రంలో కార్తి మరియు రిచా ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్ర ప్రత్యేకత ఏంటంటే ఈ చిత్రం యువన్ శంకర్ రాజ సంగీతం అందిస్తున్న నూరవ చిత్రం. 1997లో 16 ఏళ్ళ వయసులో “అరవిందన్” చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. 2002లో ధనుష్ “తుల్లువదో ఇలమై” చిత్రంతో అయన మంచి పేరుని సంపాదించుకున్నారు. అప్పటి నుండి ఆయన తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాలకు సంగీతం అందిస్తూ వచ్చారు. “7/G బృందావన కాలని”, “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే”, “ఓయ్”, “ఆవారా”, ” గ్యాంబ్లర్” వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించారు.

తాజా వార్తలు