కుటుంబ సమేతంగా శిరిడి వెళ్లనున్న నాగార్జున

కుటుంబ సమేతంగా శిరిడి వెళ్లనున్న నాగార్జున

Published on Jul 16, 2012 11:19 PM IST


కె రాఘవేంద్ర రావు గారి “శిరిడి సాయి” చిత్రం నాగార్జున మీద బాగా ప్రభావం చూపించినట్టు ఉంది. కొద్ది రోజుల క్రితం విలేఖరుల సమావేశంలో ఈ చిత్ర చిత్రీకరణ మొదలు పెట్టుకున్న తరువాత నుండి తన జీవితంలో విచిత్రమయిన సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. అంతకముందు జరిగిన పలు ఇంటర్వ్యూలో తనకు  దైవ భక్తి తక్కువని తెలిపారు కాని ఈ చిత్ర చిత్రీకరణ మొదలు కాగానే అతని జీవితంలో జరిగిన సంఘటనలు అతన్ని సాయి బాబా మహిమల గురించి నమ్మేలా చేసింది. మాకు అందిన సమాచారం ప్రకారం నాగార్జున జూలై 26న కుటుంబ సభ్యులతో కలిసి శిరిడి వెళ్లనున్నారు. నాగార్జున, నాగ చైతన్య , అఖిల్ మరియు అమల మిగిలిన చిత్ర బృందంతో కలిసి శిరిడి వెళ్లనున్నారు. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం చిత్రం చాలా బాగా వచ్చింది అని అంటున్నారు. ఈ చిత్రం మరొక విజయవంతమయిన చిత్రం కానుంది అని అంటున్నారు. “శ్రీ రామదాసు” మరియు “అన్నమయ్య” లానే ఈ చిత్రం కూడా విజయవంతమయిన చిత్రం కానుందని అంటున్నారు. ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఏ మహేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానుంది.

తాజా వార్తలు