‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మళయాళ భామ అమలా పాల్ ప్రస్తుతం తెలుగు మరియు తమిళ భాషలలో వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో వి.వి వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో అమలా పాల్ కథానాయికగా నటిస్తోంది.
ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో మీరు నటించిన సినిమాల్లో ఏ సినిమాకి అత్యధిక పారితోషికం తీసుకున్నారు అని అడిగిన ప్రశ్నకు అమలా పాల్ సమాధానం ఇస్తూ ” నేను మొదట కథకే ప్రాముఖ్యత ఇస్తాను ఆ తర్వాతే మనీకి ప్రాధాన్యం ఇస్తాను. మంచి పాత్రలు చేసి విజయం సాదిస్తే మనీ దానంతట అదే వస్తుంది. నేను నటనకి ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటాను మరియు నా సినిమాలు నా ఫ్యామిలీతో కూర్చొని చూసేలా ఉండాలి” అని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ఒక తెలుగు సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న అమలా పాల్ తమిళం మరియు మళయాళ భాషల్లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది.