గబ్బర్ సింగ్ రికార్డులను రాంబాబు క్రాస్ చేస్తాడా?

గబ్బర్ సింగ్ రికార్డులను రాంబాబు క్రాస్ చేస్తాడా?

Published on Jul 15, 2012 10:55 AM IST


‘గబ్బర్ సింగ్’ రికార్డులను ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ క్రాస్ చేస్తుందా? ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాలు బాగా చర్చించుకుంటున్న ప్రశ్న ఇదే. ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంతో అక్టోబర్లో మనముందుకు రానున్నారు. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి మరియు ఈ చిత్రం విడుదలకి ముందే రికార్డు బిజినెస్ సాదిస్తుందని చిత్ర వర్గాలు వారు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాథ్ కాంభినేషన్లో వస్తున్న ఈ చిత్రం ‘గబ్బర్ సింగ్’ ఓపెనింగ్ బిజినెస్ ని క్రాస్ చేస్తుందా? లేదా? అనే దానికోసం ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం గబ్బర్ సింగ్ సాదించిన రికార్డులను రాంబాబుగా మళ్ళీ తనే బద్దలుకొడుతాడని ఆశిస్తున్నారు.

తాజా వార్తలు