‘ఈగ’ మొదటి వారం నైజాం కలెక్షన్స్

‘ఈగ’ మొదటి వారం నైజాం కలెక్షన్స్

Published on Jul 12, 2012 8:01 PM IST


టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తీసిన అద్భుత గ్రాఫికల్ మానియా ” ఈగ” చిత్రం నైజాం మొదటి వారం కలెక్షన్స్ వచ్చేశాయి. ఈగ విడుదలైన 6వ రోజు ముగిసే సమయానికి నైజాంలో 6.83 కోట్ల షేర్ వచ్చింది. ఈ రోజు సాయంతం కల్లా ఈ చిత్రం 7.45 కోట్ల షేర్ సాదించింది. ఒక పెద్ద కమర్షియల్ హీరోలేని ఈ చిత్రం మొదటి వారం ఇంతటి అసాధారణ కలెక్షన్లు సాదించడం అనేది చెప్పుకోదగ్గ విషయం.

ఈ చిత్రానికి ఇంతటి భారీ ఓపెనింగ్స్ రావడానికి మరియు ఇంత విజయవంతంగా ప్రదర్శించబడటానికి గల క్రెడిట్ మొత్తం ఎస్.ఎస్ రాజమౌళి గారికే చెందుతుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. విడుదలైన ప్రతి చోటా ఎంతో విజయవంతంగా ప్రదర్శించ బడుతోంది మరియు ఇక్కడి కలెక్షన్లకి ఓవర్సీస్ కలెక్షన్లు కూడా కలిపితే మొదటి వారం మొత్తం కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉంటాయని మనం ఊహించవచ్చు.

తాజా వార్తలు