అందాల భామ సమంత టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గోల్డెన్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్నారు. ఇటీవలే విడుదలైన “ఈగ” చిత్రం ఘన విజయం సాదించడంతో ప్రస్తుతం సమంత ఎంతో సంతోషంగా ఉన్నారు. అనారోగ్యం వల్ల గత కొంత కాలంగా సినిమా షూటింగ్ లకు దూరంగా ఉన్న ఈ భామ ఈ నెల 20 నుంచి చిత్రీకరణలో పాల్గొననుంది. ” జూలై 20 నుంచి ప్రారంభమయ్యే ‘ఆటోనగర్ సూర్య’ టాకీ పార్ట్ చివరి 3 రోజుల చిత్రీకరణలో పాల్గొననున్నానని” సమంత ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు, రామ్ చరణ్, నాగ చైతన్య, సిద్దార్థ్ మరియు నానిలు హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నారు. సమంత రాబోయే చిత్రాలు కూడా విజయాన్ని సాదించి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం.