బాద్షా లో మరింత స్టైలిష్ గా కనిపించనున్న ఎన్టీఆర్

బాద్షా లో మరింత స్టైలిష్ గా కనిపించనున్న ఎన్టీఆర్

Published on Jul 10, 2012 12:56 AM IST


ఎన్టీఆర్ కొత్త అవతారం ఈరోజు ఇంటర్నెట్ లో చర్చగా మారింది. ఆయన అభిమానుల కోసం మరొక మంచి వార్త. ఈరోజు ఉదయాన అయన మీడియా తో కొడాలి నాని విషయమై మాట్లాడారు . చాలా రోజుల తరువాత ఎన్టీఆర్ కొత్త అవతారం చుసిన అభిమానులు చాలా ఆనందపడ్డారు. ఈ హెయిర్ స్టైల్ కోసం ఒక ప్రముఖ ముంబై హెయిర్ స్టైలిస్ట్ ని రప్పించారు. ఈ లుక్ ఫైనల్ లుక్ కాదని రూప వైట్ల దృవీకరించారు.” మీ అభినందనలకి నా కృతజ్ఞతలు ఇది ఫైనల్ లుక్ కాదు బాద్షా చిత్రం కోసం మరింత స్టైలిష్ లుక్ ప్రయత్నిస్తున్నాం” అని ట్విట్టర్లో ప్రకటించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరింత స్టైలిష్ గా కనిపించనున్నారని చెప్పకనే చెప్పారు. ఇటలీలో జరగనున్న భారీ షెడ్యూల్ లో పాల్గొనేందుకు ఈ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల ఇటలీ చేరుకున్నారు. ఈ వారాంతంలోగా ఎన్టీఆర్ ఈ చిత్ర బృందంతో చేరనున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా గణేష్ బాబు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు