ఎస్ ఎస్ రాజమౌళి తాజా చిత్రం “ఈగ” అన్ని వైపులా నుండి ప్రశంశలు అందుకుంటుంది. కొద్ది రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ,పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, దేవ కట్ట, సిద్దార్థ , రామ్ మరియు ఇతర ప్రముఖులు ఈ చిత్రాన్ని మరియు రాజమౌళి పనితనాన్ని ప్రశంశలలో ముంచెత్తారు. ప్రస్తుతం దక్షణాది నుండి ముగ్గురు ప్రముఖులు ఈ చిత్రం గురించి మాట్లాడారు. చెన్నై లో శంకర్ “నాన్ ఈ” చిత్రాన్ని చూశాక “నాన్ ఈ – సూపర్ పడం(నాన్ ఈ – సూపర్ చిత్రం)” అని విజిటర్స్ బుక్ లో రాశారు. ఈ కామెంట్ మరియు అయన సంతకం చేసిన ఫోటో ఇంటర్నెట్ లో తిరుగుతుంది.మహేష్ బాబు ఈ చిత్రాన్ని తనదయిన శైలిలో ట్విట్టర్లో ప్రశంశలలో ముంచెత్తారు. “తెలుగు చలన చిత్ర పరిశ్రమలో “ఈగ” ఒక గొప్ప చిత్రంగా మిగిలిపోతుంది. రాజమౌళి గారికి మరియు అతని బృందానికి శుభాకాంక్షలు. ఈ చిత్రంలో సుదీప్ అద్భుతమయిన ప్రదర్శన కనబరిచారు” అని మహేష్ బాబు ట్విట్టర్లో అన్నారు. నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ “ఇప్పుడు నాకు ఎస్ ఎస్ రాజమౌళిలో ఎస్ ఎస్ ఏంటో ఇప్పుడు తెలిసింది. ఎస్ ఎస్ అంటే “ష్యూర్ షాట్” రాజమౌళి. ఇప్పుడు “ఈగ” చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో మెయిలు రాయిగా మిగిలిపోనుంది” అని అన్నారు. ఈ చిత్రం తమిళ నాడు లో కూడా తనదయిన సత్తా చూపిస్తుంది. మరి కొంతకాలం వరకు ఎటువంటి పెద్ద చిత్రాల విడుదల లేకపోవటంతో ఈగ మరింత వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తుంది.
ఈగ చిత్రాన్ని మెచ్చుకున్న శంకర్,మహేష్ బాబు,నాగార్జున
ఈగ చిత్రాన్ని మెచ్చుకున్న శంకర్,మహేష్ బాబు,నాగార్జున
Published on Jul 9, 2012 10:14 PM IST
సంబంధిత సమాచారం
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్‌కు వెళ్లిన సినిమా ఏది..?
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?