ఆగస్ట్ లో రానున్న “వెన్నెల 1 1/2”

ఆగస్ట్ లో రానున్న “వెన్నెల 1 1/2”

Published on Jul 8, 2012 7:45 PM IST


వెన్నెల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “వెన్నెల 1 1/2” ఆగస్ట్ లో విడుదలకు సకలం సిద్దమయ్యింది. ఈ చిత్ర ప్రధాన బాగా చిత్రీకరణ ఒక ఏడాది క్రితమే పూర్తి అయ్యింది. కాని ఈ చిత్రం పలు కారణాల మూలాన వాయిదా పడుతూ వచ్చింది అందులో నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యం కావడం కూడా ఒకటి. తరువాత ఈ చిత్రాన్ని మంచి ధరకు అనిల్ సుంకర కొనుక్కున్నారు ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలని తిరిగి తెరకెక్కించారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. చైతన్య కృష్ణ మరియు మోనాల్ గజ్జర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించగా సురేష్ భార్గవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం దేవ్ కట్ట దర్శకత్వంలో విడుదలయ్యి సంచలన విజయం సాదించిన “వెన్నెల” చిత్రానికి సీక్వెల్.

తాజా వార్తలు