మీరు వింటున్నది నిజమే. సౌత్ ఇండియన్ అందాల భామ బాలీవుడ్లో మరో అవకాశం దక్కించుకుంది. ‘లక్’ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టిన ఈ భామ తను నటించిన సినిమాలు అనుకున్నంత విజయం సాధించక పోవడంతో సౌత్ సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపొయింది. శ్రుతి హాసన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో శ్రుతి హాసన్ కి డిమాండ్ పెరిగిపోయింది. దర్శకుడిగా మారి బాలీవుడ్ లో వరుస విజయాలు అందుకున్న కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మళ్ళీ శ్రుతి హాసన్ ని బాలీవుడ్ కి తీసుకెళ్లనున్నారు.
ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘రౌడీ రాథోర్’ ఇటీవలే విడుదలైన ఘన విజయం సాదించింది. ఈ చిత్రం తర్వాత ప్రభుదేవా టిప్స్ మ్యూజిక్ ఇండస్ట్రీ అధినేత రమేష్ తరుణి కుమారుడు గిరీష్ ని హీరోగా పరిచయం చేయనున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా ఎంపికయ్యారు. సెప్టెంబర్లో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ” ఈ చిత్రం కోసం మొదట కొత్త అమ్మాయిని పరిచయం చేయాలనుకున్నామని, కానీ కొత్త అమ్మతికంటే శ్రుతి హాసన్ బాగుంటుందనే ఉద్దేశంతో తనని తీసుకున్నామని” ప్రభుదేవానే స్వయంగా అన్నారు. శ్రుతి హాసన్ ప్రస్తుతం తెలుగు మరియు తమిళ భాషలలో మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. తెలుగులో ప్రస్తుతం రవితేజ సరసన ఒక సినిమా చేయాడానికి అంగీకరించారు.