రెండవ షెడ్యూల్ కు సిద్దమైన పవన్ కళ్యాణ్

రెండవ షెడ్యూల్ కు సిద్దమైన పవన్ కళ్యాణ్

Published on Jul 8, 2012 12:14 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు”. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ సోమవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ఈ చిత్రంలోని ప్రముఖ తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత వస్తున్న ఈ చిత్రం పై బారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ నటనని చూడవచ్చని ఆశిద్దాం.

తాజా వార్తలు