అక్షయ్ కుమార్ చిత్రానికి సంగీతం అందించబోతున్న ఎం ఎం కీరవాణి

అక్షయ్ కుమార్ చిత్రానికి సంగీతం అందించబోతున్న ఎం ఎం కీరవాణి

Published on Jul 6, 2012 2:33 AM IST


అక్షయ్ కుమార్ రాబోతున్న చిత్రం “స్పెషల్ చబ్బీస్” చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించబోతున్నారు. గతంలో “ఏ వెడ్నస్ డే” చిత్రానికి దర్శకత్వం వహించిన నీరజ్ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వయాకాం 18 మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మనోజ్ బాజ్పాయి మరియు అనుపం ఖేర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం చెయ్యడానికి నీరజ్ పాండే ఎం ఎం కీరవాణి ని ఎంచుకున్నారు. 1987లో సి బి ఐ ఆఫీసర్ అని చెప్పి 25 మందిని ఒక బంగారు దుకాణాన్ని లూటి చెయ్యడానికి నియమించుకున్న ఒక యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. మాములుగా కీరవాణి హిందీ చిత్రాలు చేసేప్పుడు తన పేరుని ఎం ఎం క్రీమ్ గా వేసుకుంటారు గతంలో ఈయన “జిస్మ్”, “పహేలి”,”క్రిమినల్”, “సర్ అండ్ లాహోర్” చిత్రాలకి సంగీతం అందించారు. ఆసక్తి కరంగా అక్షయ్ కుమార్ ఇటీవల చిత్రం “రౌడీ రాథోర్” చిత్రంలో కీరవాణి స్వరపరచిన “జింత త జింత” సాంగ్ ఉంది.

తాజా వార్తలు