ఈ చిత్రమైనా రఘు కుంచెకి స్టార్డమ్ ఇమేజ్ తెస్తుందా?

ఈ చిత్రమైనా రఘు కుంచెకి స్టార్డమ్ ఇమేజ్ తెస్తుందా?

Published on Jul 5, 2012 3:29 PM IST


తెలుగు సంగీత దర్శకుడు రఘు కుంచె ఇప్పటివరకు ‘బంపర్ ఆఫర్’, ‘ఆహ నా పెళ్ళంట’ మరియు ‘దగ్గరగా దూరంగా’ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాలు ఏవి అతనికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు నివ్వలేదు. ఈ మధ్యనే విడుదలైన ‘ దేవుడు చేసిన మనుషులు చిత్ర ఆడియో ద్వారా అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రానికి రఘు కుంచె అందించిన సంగీతం అమితంగా ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రం విజయం సాదిస్తే రఘు కుంచే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి అవకాశం దొరికినట్టే.

మాస్ మహారాజ రవితేజ మరియు గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయనున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఎక్కువ భాగం చిత్రీకరణ బ్యాంకాక్లో జరుపుకొంది.

తాజా వార్తలు