వ్యాట్ సమస్యని తీరుస్తానని మాటిచ్చిన సి.ఎం

వ్యాట్ సమస్యని తీరుస్తానని మాటిచ్చిన సి.ఎం

Published on Jul 4, 2012 4:24 PM IST


తెలుగు చలన చిత్ర నిర్మాతలు మంగళవారం ముఖ్య మంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసి తెలుగు చిత్ర పరిశ్రమపై ఉన్న వ్యాట్ భారాన్ని తొలగించాలని కోరారు. ఈ సమావేశంలో నిర్మాతల మండలి అందించిన నివేదికకు ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించారనే విషయాన్ని నిర్మాతల మండలి సభ్యులకు తెలియజేయడం కోసం ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

” ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చలన చిత్ర రంగంలో ఉన్న సమస్యలను మరియు వ్యాట్ భారాన్ని తొలగిస్తానని మాట ఇచ్చారన్నారు. ఈ సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉందని అదే ఇతర రాష్ట్రాలలో ఈ సమస్య లేదని ముఖ్య మంత్రి గారికి చెప్పాము” అని నిర్మాతల మండలి సభ్యులు అన్నారు.

ఈ మధ్య కాలంలో చలన చిత్ర రంగం పైరసీ, వ్యాట్ మరియు పెరిగిపోయిన సినిమా నిర్మాణ ఖర్చు లాంటి సమస్యలతో సతమతమైపోతోంది. మన ప్రభుత్వం ఇచ్చిన మాటను త్వరలోనే అధికారికంగా ప్రకటించి చలన చిత్ర రంగాన్ని ఈ సమస్యలనుండి రక్షిస్తుందో? లేదో? అనే దాని కోసం ఇంకొంత కాలం వేచి చూడాలి.

తాజా వార్తలు