ప్రత్యకం : పివిపి సంస్థకి బంగారుగనిలా మారిన తమిళ “ఈగ”

ప్రత్యకం : పివిపి సంస్థకి బంగారుగనిలా మారిన తమిళ “ఈగ”

Published on Jul 3, 2012 8:22 PM IST


ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఈగ”. ఈ చిత్రం తమిళంలో “నాన్ ఈ” పేరుతో విడుదల కానుంది ఈ చిత్రం తమిళ బయ్యర్ పి వి పి సినిమాస్ వారికి బంగార గనిగా మారింది. ఈ చిత్ర శాటిలైట్ హక్కులను నాలుగు కోట్లకు పైగా అమ్మిన ఈ సంస్థ ఇప్పుడు థియేటర్ల నుండి అడ్వాన్స్ రూపంలో ఏడు కోట్లు దక్కించుకుంది. పివిపి సినిమా వారు ఈ చిత్ర హక్కులను ఐదు కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే వారి పెట్టుబడి రెండింతలు అయ్యింది. తమిళంలో ఒక పెద్ద తార కూడా లేకుండా చిత్ర విడుదలకు ముందే ఇదంతా జరిగటం ఆశ్చర్యకరమయిన విషయమే .

ఈ విషయాలే “ఈగ” చిత్రం మీద జనంలో ఉన్న అంచనాలను తెలియచేస్తుంది. “ఈగ” చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 6న విడుదల కానుంది. సమంత,నాని మరియు సుదీప్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజా వార్తలు