మాస్ మహారాజ రవితేజ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం “బలుపు”. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా ఎంపికయ్యారు. ఈ మధ్య కొద్ది రోజుల నుంచి మీడియాలో వినిపిసున్న ఈ వార్తని గోపీచంద్ మలినేని గారే స్వయంగా దృవీకరించారు.ఈ కథ గురించి పూర్తిగా చెప్పి శ్రుతి హాసన్ ని ఒప్పించానని ఆయన అన్నారు. ‘ గబ్బర్ సింగ్’ తర్వాత శ్రుతి హాసన్ తెలుగులో మొదట ఈ చిత్రానికే అంగీకారం తెలిపారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. కోన వెంకట్ ఈ చిత్రానికి కథా రచయితగా పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం చివరిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
ప్రస్తుతం రవితేజ పరశురాం దర్శకత్వం వహిస్తున్న “సార ఒస్తారా” చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ ఊటీలో జరుగుతోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మరియు రిచా గంగోపాద్యాయలు కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే రవితేజ మరియు ఇలియానా జంటగా నటించిన ” దేవుడు చేసిన మనుషులు” చిత్రం జూలై 27న విడుదల కానుంది. రవితేజ ఈ సంవత్సరం వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.