బ్యాంకాక్ పయనమయిన రామ్ చరణ్

బ్యాంకాక్ పయనమయిన రామ్ చరణ్

Published on Jul 2, 2012 8:00 PM IST


ఇటలి నుండి వచ్చిన వారం తరువాత రామ్ చరణ్ తన రాబోతున్న హిందీ చిత్రం “జంజీర్” లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ లో చిత్రీకరించే కొన్ని ముఖ్యమయిన సన్నివేశాల కోసం రామ్ చరణ్ బ్యాంకాక్ కి పయనమయ్యారు. ప్రకాష్ రాజ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ చిన్న పాత్రలో కనిపించనున్నారు. అపూర్వ లాఖియ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. బ్యాంకాక్ షెడ్యూల్ తరువాత రామ్ చరణ్ వి వి వినాయక్ చిత్రంలో పాల్గొంటారు. ఈ చిత్రంలో కాజల్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

తాజా వార్తలు