జూలై రెండవ వారంలో ప్రారంభం కానున్న ‘బాద్షా’ ఫస్ట్ షెడ్యూల్

జూలై రెండవ వారంలో ప్రారంభం కానున్న ‘బాద్షా’ ఫస్ట్ షెడ్యూల్

Published on Jul 2, 2012 4:29 PM IST


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా తెరకెక్కనున్న కామెడి యాక్షన్ ఎంటర్టైనర్ “బాద్షా”. జూలై 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ చిత్ర ఇటాలియన్ షెడ్యూల్ వాయిదా పడింది. వాయిదా పడిన ఈ చిత్ర మొదటి షెడ్యూల్ జూలై 9 నుంచి ఇటలీలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం మొదటి సారిగా శ్రీను వైట్ల – ఎన్.టి.ఆర్ కలిసి పనిచేస్తున్నారు. ఈ కామెడి ఎంటర్టైనర్ చిత్రంపై సినీ అభిమానులకు భారీ అంచనాలున్నాయి. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంతో రెండవసారి ఎన్.టి.ఆర్ తో కలిసి ఆడి పాడనుంది. ఇటలీలో మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ చిత్ర టీం ఇండియాకి వచ్చి ఇక్కడ కొద్ది రోజులు షూటింగ్ జరుపుకున్న తర్వాత చివరి షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లనున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు