షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీమన్నారాయణ

షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీమన్నారాయణ

Published on Jun 30, 2012 8:40 PM IST


నట సింహం నందమూరి బాలకృష్ణ హోరోగా తెరకెక్కుతున్న చిత్రం ” శ్రీమన్నారాయణ”. ఇటీవలే స్విట్జర్ల్యాండ్ మరియు ఇటలీల్లో రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో ఈ చిత్రం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రంలో మిగిలి ఉన్న ఆఖరి సన్నివేశాల చిత్రీకరణతో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జూలైలో జరుపుకోనున్న ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తునారు. రవి కుమార్ చావాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి చిత్ర పరిశ్రమలో మంచి అభిప్రాయం ఉంది మరియు ఈ చిత్రంలో పవర్ఫుల్ జర్నలిస్ట్ గా బాలకృష్ణ కనిపించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్వతి మెల్టన్ మరియు ఇషా చావ్లా ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. స్వర చక్రవర్తి చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు