పెళ్ళికి సిద్ధమైన లవ్ ఫెయిల్యూర్ దర్శకుడు

పెళ్ళికి సిద్ధమైన లవ్ ఫెయిల్యూర్ దర్శకుడు

Published on Jun 30, 2012 5:40 PM IST


లవ్ ఫెయిల్యూర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు బాలాజీ మోహన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు అరుణని త్వరలో వివాహమాడనున్నారు. వీరి పెళ్ళికి ఇరు వర్గాల కుటుంబ సభ్యులు అంగీకరించారు. లవ్ ఫెయిల్యూర్ సినిమా చిత్రీకరణ సమయంలోనే బాలాజీ మోహన్ ఆమెకి తన ప్రేమని తెలపగా ఆమె అంగీకరించింది. బాలాజీ మోహన్ ప్రస్తుతం వైనాట్ పిక్చర్స్ వారితో మరో సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు. అలాగే లవ్ ఫెయిల్యూర్ సినిమాని కూడా హిందీలో తెరకెక్కించే పనుల్లో ఉన్నాడు.

తాజా వార్తలు