ప్రస్తుతం చలన చిత్ర రంగంలో చాలా మంది హీరోలు ఇతరులకు సహాయం చేసి తమ ఔన్నత్యాన్ని చాటుకొంటున్నారు. అదే బాటలో హీరో మంచు విష్ణు కూడా చేరారు, ఆంద్ర ప్రదేశ్ సినీ స్టంట్ డైరెక్టర్స్ మరియు స్టంట్ ఆర్టిస్ట్ యూనియన్కి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. విష్ణు కూడా స్టంట్స్ చేయడంలో శిక్షణ తీసుకున్న విషయం మనకు తెలిసిందే,తనకి స్టంట్స్ మీద ఉన్న ఇష్టంతో విష్ణు స్టంట్ అసోషియేషన్లో ఒకరురుగా తన పేరును కూడా నమోదు చేసుకున్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ ” డూప్ స్టంట్స్ చేసే వారి జీవితంలో ప్రమాదాలు పొంచి ఉంటాయని, డూప్స్ చేసే స్టంట్స్ వల్లే ప్రతి నటుడుకి మంచి పేరు వస్తుందని ఆయన అన్నారు. థియేటర్లలో అభిమానులు బాగా ఎంజాయ్ చేసే స్టంట్స్ లో డూప్స్ వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తారని ఆయన అన్నారు. ఆయన చేసిన సహాయం కష్టాలలో ఉన్న నటులకి, వారి పిల్లల చదువుకి మరియు స్టంట్స్ చేసే వారి కుటుంబాలలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని ఆదుకోవడానికి వినియోగించాలని ఆయన తెలిపారు.’ మనం ఎదుటివారిని చాలా రకాలుగా ప్రభావితం చేయవచ్చు కానీ స్టంట్ నిపుణులలో ఒకరిగా ప్రభావితం చేయడం మరియు అక్కడ వారి నుండి నేర్చుకునే అనుభవం చాలా గొప్పగా ఉంటుందని’ ఆయన అన్నారు”. మంచి మనసున్న విష్ణు చలన ఈ విషయంతో చిత్ర రంగంలో సామాజిక భాద్యత ఉన్న వ్యక్తిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.