ఢమరుకం స్టిల్స్ కి అద్బుతమయిన స్పందన

ఢమరుకం స్టిల్స్ కి అద్బుతమయిన స్పందన

Published on May 25, 2012 5:01 PM IST

కింగ్ అక్కినేని నాగార్జున భారీ బడ్జెట్ సోషియో ఫాంటసి చిత్రం “ఢమరుకం” ఈ జూలైలో విడుదలకి సిద్దమయ్యింది. ఈ చిత్రానికి సంభందించిన కొత్త సెట్ స్టిల్స్ నిన్న విడుదల చేశారు. ఈ ఆసక్తి కరమయిన స్టిల్స్ కి ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుంది. పరిశ్రమ వర్గాలు దీని గురించే మాట్లాడుతున్నారు నాగ్ ఈ చిత్రంతో తన మాయాజాలాన్ని తిరిగి చేస్తారేమో అని వేచి చూస్తున్నారు. స్టిల్స్ చూస్తుంటే సాంకేతిక విలువల్లో ఎటువంటి అవకాశం తీసుకున్నట్టు కనిపించలేదు. ఈ చిత్రం కోసం వేచి చూసే వాళ్ళలో నేను ఒకడిని అని ఒక ప్రముఖ డిస్ట్రిబ్యుటర్ అన్నారు. ఈ చిత్రం నిర్మాణాంతర పనుల్లో చివరి దశలో ఉంది ఒక పాట చిత్రీకరించాల్సి ఉంది. ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా డి.వెంకట్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్ దాదాపుగా 30 కోట్లు ఉండవచ్చని అంచనా. నాగార్జున కెరీర్ లో అత్యంత ఖరీదయిన ఈ చిత్రం లో అనుష్క కథానాయిక.

తాజా వార్తలు