రేపు బాక్స్ ఆఫీస్ ని ‘దరువు’ వేయనున్న రవితేజ

రేపు బాక్స్ ఆఫీస్ ని ‘దరువు’ వేయనున్న రవితేజ

Published on May 24, 2012 11:13 AM IST


మాస్ మహారాజ రవితేజ బాక్స్ ఆఫీస్ మీద ‘దరువు’ వేయడానికి రేపు రాబోతున్నాడు. సోషియో ఫాంటసి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం యమలోకం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది. యమలోకంలో సత్యనారాయణ, తమిళ నటుడ ప్రభు, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయని సమాచారం. రవితేజ హోం మినిస్టర్ గా వచ్చే సన్నివేశాలు కూడా బాగా అలరిస్త్యని చిత్ర నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ చెబుతున్నారు. ఎంటర్టైన్మెంట్ తో పాటుగా మెసేజ్ ఇస్తున్నట్లు నిర్మాత చెబ్బుతున్నారు. విజయ్ అంటోనీ సంగీతం అందించిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు