అధినాయకుడు నటిగా నా గుర్తింపు పెంచుతుంది – లక్ష్మి రాయ్

అధినాయకుడు నటిగా నా గుర్తింపు పెంచుతుంది – లక్ష్మి రాయ్

Published on May 21, 2012 10:05 AM IST


‘అధినాయకుడు’ సినిమాలో తన ప్రదర్శన పట్ల లక్ష్మి రాయ్ చాలా సంతృప్తిగా ఉంది. ఈ సినిమాలో తన పాత్ర మాస్ అభిమానులను ఆకట్టుకుంటూ మతిగా తన గుర్తింపు పెరిగేలా ఉంటుందని అంటుంది. ఈ పాత్ర తనకు స్పెషల్ అనీ, తన కెరీర్ కి బాగా హెల్ప్ అవుతుందని అంటుంది. తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా తిరుపతికి వెళ్ళిన లక్ష్మి రాయ్ అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది. అధినాయకుడు అన్ని హంగులు పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. నందమూరి బాలకృష్ణ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చితనికి పరుచూరి మురళి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు