29 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఎన్టీయార్

29 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఎన్టీయార్

Published on May 20, 2012 11:11 AM IST

యంగ్ టైగర్ ఎన్టీయార్ ఈరోజు 29వ పడిలో ప్రవేశించబోతున్నారు ఆయన హీరోగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి పదేళ్ళు దాటింది ఈ పదేళ్ళలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగారు.1983 ,మే 20న పుట్టిన ఎన్టీయార్ తన ఎనిమిదేళ్ళ వయసులోనే “బ్రహ్మర్షి విశ్వామిత్ర” చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. 1997 “బాలరామాయణం” చిత్రంలో నటనకు గాను జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నారు. “నిన్ను చూడాలని” చిత్రంతో హీరోగా పరిచయమయిన ఈయన ఎస్.ఎస్.రాజమౌళి “స్టూడెంట్ నెం.1” చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్నారు. వి.వి.వినాయక్ తో చేసిన “ఆది” తో మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీయార్ “సింహాద్రి” చిత్రంతో పరిశ్రమలో తార అయిపోయాడు. అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన సంచలనం తెలిసిందే. తరువాత “రాఖీ” చిత్రంతో విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు “అదుర్స్” మరియు “యమదొంగ” చిత్రాలలో తనలోని విభిన్న నటుడిని పరిచయం చేశారు. ఆయనలోని రాజసం అయన డైలాగ్ డెలివరీ ఇప్పటి హీరోలలో కనిపించడం కాస్త కష్టమే పొడవయిన సంభాషణలను అలవోకగా చెప్పే అతి తక్కువ హీరోలలో ఎన్టీయార్ ఒక్కరు. ఈ మధ్య విడుదలయిన ఆయన చిత్రం “దమ్ము” అయన స్టార్ పవర్ ఏంటో చూపిస్తుంది. ఎన్టీయార్ త్వరలో శ్రీను వైట్ల తో కలిసి “బాద్షా” చేస్తున్నారు ఈ చిత్ర చిత్రీకరణ జూన్ 11 నుండి మొదలు కానుంది. గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కాజల్ కథానాయికగా చేస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు