రవితేజ చిత్రం నుండి తప్పుకున్న త్రిష

రవితేజ చిత్రం నుండి తప్పుకున్న త్రిష

Published on May 18, 2012 9:45 PM IST

రవి తేజ తాజా చిత్రం “సార్ వస్తారు” చిత్రం నుండి అమలా పాల్ వెళ్ళిపోయిన కొద్ది రోజుల్లోనే త్రిష కూడా ఈ చిత్రం నుండి బయటకి వెళ్లిపోయింది. ఈ చిత్రంలో త్రిష ప్రధాన పాత్రలో నటించాల్సి ఉంది కాని డేట్స్ సర్దుబాటు కుదరకపోవటం మూలాన ఈ చిత్రం నుండి తప్పుకుంది. ఈ చిత్రం జూన్ మొదటి అర్ధ భాగంలో చిత్రీకరణ మొదలు పెట్టుకోవాల్సి ఉంది. “అవును “సార్ వస్తారు” చిత్రం నుండి తప్పుకున్నాను నా కారణాలు నాకున్నాయి ఇప్పుడు నా చేతినిండా పలు చిత్రాలున్నాయి “సమర్”,”ఎండ్రేండ్రుం పున్నగై” మరియు “భూలోగం” చిత్రాలు చేస్తున్న రవితేజతో తొందరలో మరో చిత్రం చేస్తానని అనుకుంటున్నా మే చివర్లో “భూలోగం” జూన్ మధ్యలో “ఎండ్రేండ్రుం పున్నగై” మొదలవుతుంది అని ట్విట్టర్ లో చెప్పారు. ప్రస్తుతం విశాల్ సరసన నటిస్తున్న “సమర్” చిత్రం కోసం బ్యాంకాక్ లో ఉన్నారు. “భూలోగం” చిత్రంలో ఈ భామ జయం రవి సరసన కనిపించనున్నారు. “దమ్ము” చిత్రం తరువాత ఆమె ఒప్పుకున్నా ఒకే ఒక్క చిత్రం “సార్ వస్తారు” ఇప్పుడు ఆ చిత్రం నుండి తప్పుకోవటం వల్ల ఆమె మళ్ళి తెలుగు తెర మీద కనిపించడానికి సమయం పట్టేట్టు ఉంది. ఇదిలా ఉండగా పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం మరో తారను వెతుకుతున్నారు. మరిని విశేషాల కోసం వేచి చూడాలి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు