దేవుడు చేసిన మనుషులు టాకీ పూర్తి

దేవుడు చేసిన మనుషులు టాకీ పూర్తి

Published on Apr 27, 2012 11:02 AM IST

పూరి జగన్నాథ్ దేవుడు చేసిన మనుషులు చిత్ర ప్రధాన భాగం చిత్రీకరణ త్వరగా ముగిస్తున్నారు. గత నెల నుండి ఈ చిత్రం బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈరోజు పూరి జగన్నాథ్ ఈ చిత్ర టాకీ భాగం పూర్తయ్యింది అని ప్రకటించారు. నాలుగు పాటలు మినహా మిగిలిన చిత్ర చిత్రీకరణ ముగిసిందని తెలిపారు. రవి తేజ మరియు ఇలియానా లు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవికి “సైలంట్ కిల్లెర్ ” కాబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. “బిజినెస్ మాన్” వంటి భారీ విజయం తరువాత పూరి తన తరువాతి చిత్రాన్ని మూడు నెలల్లో ముగించాలని నిర్ణయించుకున్నారు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతం అందించారు. బి వి ఎస్ ఎం ప్రసాద్ ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు