డిఐ జరుపుకుంటున్న దమ్ము

డిఐ జరుపుకుంటున్న దమ్ము

Published on Apr 16, 2012 12:23 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ దమ్ము ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతుండగా ప్రస్తుతం డిఐ (డిజిటల్ ఇంటర్మీడియట్) పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మొదటి కాపీ సిద్ధమవుతుందని సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాని తమిళ్లో కూడా విడుదల చేయబోతున్నారని సమాచారం. ఈ చిత్ర నిడివి 2 గంటల 10 నిముషాలు ఉంటుందని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల నుండి ఈ సినిమా పై పాజిటివ్ టాక్ వినపడుతుంది. కార్తీక మరియు త్రిషా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకుడు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎస్ రామారావు సమర్పిస్తున్నారు.

తాజా వార్తలు