ఎందుకంటే ప్రేమంట కోసం ఆసక్తి కనబరుస్తున్న డిస్ట్రిబ్యూటర్స్

ఎందుకంటే ప్రేమంట కోసం ఆసక్తి కనబరుస్తున్న డిస్ట్రిబ్యూటర్స్

Published on Apr 16, 2012 9:21 AM IST


రామ్ మరియు తమన్నా జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టొరీ ‘ఎందుకంటే ప్రేమంట’ ఆడియో త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా ఈ చిత్రం తమిళ్లో కూడా విడుదలకు సిద్ధమవుతుంది. తమిళంలో ‘ఎన్ ఎండ్రాల్ కాదల్ ఎందేన్’ పేరుతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంభందించిన లోగో ఆవిష్కరణ నిన్న చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు రామ్, తమన్నా, చిత్ర దర్శకుడు కరుణాకరన్, నిర్మాత స్రవంతి రవికిషోర్, మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ కుమార్, మురుగదాస్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ ఇటీవలే అన్ని ఏరియాల నుండి సినిమా కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. విదేశాలలో కూడా ఈ సినిమా కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఈ నెల 21న విడుదల కానుంది.

తాజా వార్తలు