పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ ప్రోమో బిట్ సాంగ్స్ ఈ రోజే విడుదలయ్యాయి. ఆరు పాటలున్న ఈ ఆల్బం మాస్, యూత్, సినిమా అభిమానులని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మొదటి పాట ‘దేఖో దేఖో గబ్బర్ సింగ్’ పాట పవన్ అభిమానులని ఆకట్టుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ తన మేజిక్ మళ్లీ చూపించబోతున్నాడు అంటూ మేము ఇప్పటికే చెప్పాము. కెవ్వు కేక, మందు బాబులం మరియు పిల్ల పాటలు మాస్ అభిమానులని ఉర్రూతలూగించడం మాత్రం ఖాయం. శృతి హసన్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకుడు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రోమో సాంగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి