సీడెడ్లో మొదటి రోజు కలెక్షన్లు అదరగొడుతున్న రచ్చ

సీడెడ్లో మొదటి రోజు కలెక్షన్లు అదరగొడుతున్న రచ్చ

Published on Apr 6, 2012 10:41 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నటించిన ‘రచ్చ’ చిత్రం నిన్న విడుదలై కలెక్షన్ల రికార్డుల వర్షం కురిపిస్తుంది. వేసవి సెలవుల్లో విడుదలైన మొదటి చిత్రం రచ్చ. వేసవి సెలవుల్ని క్యాష్ చేసుకుంటున్న రచ్చ చిత్రం మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం సీడెడ్ ఏరియాలో మొదటి రోజుకు గాను దాదాపు 2 కోట్ల 23 లక్షలు వసూలు చేసింది. రామ్ చరణ్ క్రేజ్ మరియు తమన్నా అంధచందాలు, మణిశర్మ సంగీతం, పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్ ప్రేక్షకులను థియేటర్ కి రప్పించేలా చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు