ప్రత్యేకం : ఇటలీలో ఎన్టీఆర్ ‘బాద్షా’ చిత్రీకరణ

ప్రత్యేకం : ఇటలీలో ఎన్టీఆర్ ‘బాద్షా’ చిత్రీకరణ

Published on Apr 3, 2012 12:10 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ సినిమా తరువాత చేయబోయే చిత్రం ‘బాద్షా’. శ్రీను వైట్ల డైరెక్షన్లో రానున్న ఈ సినిమా మొదట్లో సియోల్ లో చేయాలని భావించినప్పటికీ మాకు అందిన తాజా సమాచారం ప్రకారం సియోల్ కాకుండా ఇటలీలో షూట్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇటలీ చేరుకున్న చిత్ర బృందం ఈ నెల 9న తిరిగి రానుంది. ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ మరియు ఇతర యూనిట్ సభ్యులు అందమైన లోకేషన్లు వెతికే పనిలో ఉన్నారు. కాజల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బండ్ల గణేష్ బాబు నిర్మాత. రెగ్యులర్ షూటింగ్ మే నుండి ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు