మా ‘ఈగ’ చాలా తెలివైంది: రాజమౌళి

మా ‘ఈగ’ చాలా తెలివైంది: రాజమౌళి

Published on Mar 12, 2012 12:20 PM IST


అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరక్కిస్తున్న ఈగ చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 30న ఆడియో విడుదల కానున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ మా సినిమాలోని ఈగ చాలా తెలివైంది. ఆ ఈగ తన పగ తీర్చుకునేందుకు ఆసక్తికరమైన దారి ఎంచుకుంటుంది. అది తెరపై చూస్తేనే బావుంటుంది. కీరవాణి అందించిన ఆడియో సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. రాజమౌళి ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం కటింగ్ ఎడ్జ్ అనే కొత్త టెక్నాలజీ వాడుతున్నట్లు చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.

తాజా వార్తలు