నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ‘అలా మొదలైంది’ చిత్రం విడుదలై సంవత్సరం దాటిపోయింది. చిన్న చిత్రం గా విడుదలై పెద్ద విజయం స్సధించిన విషయం తెలిసిందే. సంవత్సరం గ్యాప్ తరువాత నందిని రెడ్డి తన తరువాత చిత్రం సిద్ధార్థ్, సమంతలతో చేయబోతుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ఫిబ్రవరి 2 నుండి షూటింగ్ ప్రారంభం కాబోతుంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో సమంత ఈ చిత్రం కోసం కాల్షీట్లు ఇవ్వడం లేదని బెల్లంకొండ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఈ వివాదం ముగిసి షూటింగ్ ప్రారంభం కాబోతుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.