ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలవుతున్న “స్నేహితుడు”

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలవుతున్న “స్నేహితుడు”

Published on Jan 25, 2012 7:30 PM IST

శంకర్ తాజా చిత్రం “స్నేహితుడు” చిత్రం జనవరి 26న విడుదల అవుతుంది. ఈ గణతంత్ర దినోత్సవానికి ఈ చిత్రాన్ని చాలా తక్కువ అంచనాలతో విడుదలవుతుంది. పదిహేనేళ్ళ తరువాత ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అవుతున్న శంకర్ చిత్రం మాములుగా ప్రతి శంకర్ చిత్రం తమిళ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తారు.జెంటిల్ మాన్ నుండి రోబో వరకు తెలుగు లో ప్రతి చిత్రం అద్బుతంగా ఆడింది. విజయ్, జీవ, శ్రీరామ్ మరియు ఇలియానా లు ఈ చిత్రం లో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం హిందీ “3 ఇడియట్స్” చిత్రానికి రిమేక్. ఇంతవరకు తెలుగు లో ఏ విజయ్ చిత్రం విజయం సాదించలేదు ఈ మధ్య విడుదలయిన జీవ రెండు డబ్ చిత్రాలు కూడా పరాజయం పొందాయి. తమిళం లో మంచి స్పందన లభించిన తెలుగు లో ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. హరీస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి “అబ్బూరి రవి” మాటలు అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యుట్ చేస్తున్నారు.

తాజా వార్తలు