రానున్న తమిళ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనుందని తమన్నా ఖరారుచేసింది. ఈ సినిమా ‘బాస్ ఎంగిరా భాస్కరన్’ అనే సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్. ఆ చిత్రాన్ని తెలుగులో ‘నేనే అంబానీ’ అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ సినిమా మొదటి వెర్షన్ లో ఆర్య, నయనతార ప్రధానపాత్రలు పోషించారు. ఇప్పుడు ఆర్యతో తమన్నా జతకట్టనుంది. ఈ సీక్వెల్ లో నాయనాతార నటిస్తుందో లేదో ఇంకా అధికారికారికంగా తెలియాలి
చాలా రోజులు ఈ సినిమాలో తమన్నానే నాయిక అంటూ ప్రచారాలు సాగినా ఈరోజు వరకూ ఆమె ధ్రువీకరించలేదు. ఈరోజు తమన్నా అభిమానులతో తన ఫేస్ బుక్ పేజ్ లో వెల్లడించింది “బాస్ ఎంగిరా భాస్కరన్ సినిమా సీక్వెల్ లో రాజేష్ దర్శకత్వంలో నటిస్తున్నందుకు ఆనందంగా వుంద”ని చెప్పుకొచ్చింది. మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు
ఈ ఏడాది ఈ భామ మహేష్ సరసన ఆగడు, ప్రభాస్ సరసన బాహుబలి సినిమాలో నటిస్తుంది. హిందీ విషయాలకు వస్తే హమ్ షకల్స్, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తమన్నా చేతిలో వున్నాయి